Type Here to Get Search Results !

రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట Song Lyrics | Rajulaku rajanta prabhuvulaku prabhuvanta song Lyrics - Calvary Temple Songs Lyrics

రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట Song Lyrics | Rajulaku rajanta prabhuvulaku prabhuvanta song Lyrics - Calvary Temple Songs Lyrics

Singer Calvary Temple

రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట
బెల్లేహేము పురములోన పుట్టెనంట
సూడసక్కనోడంట పశులపాకలోనంట
దావీదు కుమారుడంట లోక రక్షకుడంట
కనులారా. ఓహెూ కనులారా.
ఆహా. కనులారా సూద్దాము రారండి బాలయేసుని
మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని - 2


పాపమంత బాపునంట దోషమంత మాపునంట
కరుణశీలుడు ఆ యేసు కనికరించె దేవుడంట 2
ఇమ్మానుయేలుగ తోడుండునంట సిన్ని యేసయ్య
ఎన్నడు విడువక ఎడబాయడంట మంచిమెస్సయ్య 2


జ్ఞానులంత జూచిరంట గొల్లలంత గూడిరంట
బాలయేసు పాదచెంత చేరి స్తుతియించారంట
బంగారు సాంబ్రాణి బోళములతో ఘనపరిచినారంట

దివిలోన దూతలు పరిశుద్దుడంటూ కొనియాడినారంట



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.