Type Here to Get Search Results !

Raja jagamerigina na yesu raja Song Lyrics | రాజ జగమెరిగిన నా యేసు రాజా | Bro. Yesanna Garu Songs Lyrics | Hosanna Ministries Songs Lyrics

Raja jagamerigina na yesu raja Song Lyrics | రాజ జగమెరిగిన నా యేసు రాజా - Yesanna Garu | Hosanna Ministries Songs Lyrics

Singer Yesanna Garu

రాజ జగమెరిగిన నా యేసు రాజా
రాగాలలో అనురాగాలు కురిపించిన
మనబంధము అనుబంధము } 2
విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? || రాజ ||} 2

దీన స్థితియందున సంపన్న స్థితియందున
నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే - 2
నిత్యము ఆరాధనకు నా ఆధారమా
స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా - 2 || రాజ ||

బలహీనతలయందున అవమానములయందున
పడినను కృంగినను నీకృప కలిగియుందునే - 2
నిత్యము ఆరాధనకు నా ఆధారమా
స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా 2 || రాజ ||

సీయోను షాలేము మన నిత్య నివాసము
చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి యుందునే - 2
నిత్యము ఆరాధనకు నా ఆధారమా
స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా - 2 || రాజ ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area