Parishuddudochhinadamma Song Lyrics | పరిశుద్ధుడొచ్చినాడమ్మా.Song Lyrics | New Telugu Christmas Songs Lyrics
Singer | Sumathi |
రారండో జనులారా..క్రీస్తేసు జన్మించినాడయ్యా...
రారండో ప్రజలారా..మన కొరకు
క్రీస్తు పుట్టినాడమ్మా...
పరిశుద్ధుడొచ్చినాడమ్మా...
ప్రభు యేసు జన్మించాడమ్మా... ||2||
రండి రారండీ ఆ బాలుని చూసొద్దాం...
రండి రారండీ ఈ వార్తను చాటేద్దాం... ||2||
అను.ప: సందడి చేద్దాం (3) మనమంతా...
సందడి చేద్దాం (3) ఊరంతా.... ||2||
|| పరిశుద్ధుడొచ్చినాడమ్మా |
చరణం 1 : చలి చలిగున్న వేళల్లో ..
బెత్లెహేమనే గ్రామంలో...
కన్య మరియమ్మ గర్భాన...
యేసునాధుడు జన్మించే....||2||
దేవ దూతలు గానములతో పాటలు పాడిరీ.
ఆ గొర్రె కాపరులు గంతులు వేసి ఆడిరీ..||2||
||సందడి చేద్దాం ||
ఛరణం 2 :
ఆకాశంలో ఓ తార ...
క్రీస్తు జననమే తెలిపేను...
కలవరమొందే హేరోదు
ఆ వార్తను వినగానే... ||2||
ఆ తారనే చూస్తూ చూస్తూ జ్ఞానులు వెళ్ళిరీ...
పరిమళాలను వెదజల్లి ఆరాధనలు చేసిరీ...||2||
||సందడి చేద్దాం||