Cheralonaina padutha Song Lyrics | చెరలోనైనా పాడుతా Song Lyrics - Bro. Stevenson Songs Lyrics
Singer | Bro, Stevenson |
చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట
మరణము వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట
కరువైనా బరువైనా విడిచిపోను ప్రభు బాట
1.కష్టాల చీకటిలో దారి కానరాకపోయినా
నష్టాల వేదనలో ఆశ మరి లేకపోయినా
నా బాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా
నా తండ్రి చిత్తానికై శ్రమలోనే వెతుకుతుంటా
2.అపాయములు బరువై సొమ్మసిల్లి పడిపోయినా
సహాయకులు కరువొ దేహమంత చెడిపోయినా
నా బాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా
నా తండ్రి చిత్తానికై శ్రమలోనే వెతుకుతుంటా
3.అవాంతరాలెదురై నా నావ నిలిచిపోయినా
ప్రశాంతతే కొదువై నా గుండె చెదిరిపోయినా
నా బాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా
నా తండ్రి చిత్తానికై శ్రమలోనే వెతుకుతుంటా