నేనును నా ఇంటి వారును | Nenunu Naa Inti Vaarunu Song Lyrics - Andhra Kraisthava Keerthanalu Lyrics
Singer | Andhra Kraisthava Keerthanalu |
నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము
దీన మనసు కలిగి దేవుని దివ్య సేవను చేతుము
అనుదినంబును ప్రభుని దలచుచు – అలయకను ప్రార్ధింతుము
అనవరతమా ప్రభుని చిత్తము – ననుకరింతుము పనులలో
వేదవాక్య పఠనమందు – విసుగు – జెందక నుందుము
ఆదరంబున దైవ చిత్తము – ననుసరించుచు నడుతుము
ఆశతోడను ప్రభుని దినమును – నాచరింతుము మరువక
విసుకు జెందక నాలయమునకు – పిన్న పెద్దల దెత్తుము
పెద్దవారలు దైవజనులని – పేర్మితో భావింతుము
శుద్దుడగు ప్రభు క్రీస్తు మనసును – శ్రద్ధతోడను జూపుచు
వేదవాక్య పఠనమందు – విసుగు – జెందక నుందుము
ఆదరంబున దైవ చిత్తము – ననుసరించుచు నడుతుము