Type Here to Get Search Results !

నా జీవం నీ కృపలో దాచితివే | Naa jeevam nee krupalo Song Lyrics | Yesanna Garu Songs Lyrics | Hosanna Ministries Songs Lyrics

నా జీవం నీ కృపలో దాచితివే | Naa jeevam nee krupalo Song Lyrics - Yesanna Garu Songs Lyrics

Singer Yesanna Garu

నా జీవం నీ కృపలో దాచితివే
నా జీవిత కాలమంతా
ప్రభువా నీవే నా ఆశ్రయం
నా ఆశ్రయం ||నా జీవం||

1. పాపపు ఊబిలో పడి కృంగిన నాకు
నిత్య జీవమిచ్చితివే (2)
పావురము వలె నీ సన్నిధిలో
జీవింప పిలచితివే (2) ||నా జీవం||

2. ఐగుప్తు విడచినా ఎర్ర సముద్రము
అడ్డురానే వచ్చెనే (2)
నీ బాహు బలమే నన్ను దాటించి
శత్రువునే కూల్చెనే (2) ||నా జీవం||

3. కానాను యాత్రలో యొర్దాను అలలచే
కలత చెందితినే (2)
కాపరివైన నీవు దహించు అగ్నిగా
నా ముందు నడచితివే (2) ||నా జీవం||

4. వాగ్ధాన భూమిలో మృత సముద్రపు భయము
నన్ను వెంటాడెనే (2)
వాక్యమైయున్న నీ సహవాసము
ధైర్యము పుట్టించెనే (2) ||నా జీవం||

5. స్తుతుల మధ్యలో నివసించువాడా
స్తుతికి పాత్రుడా (2)
స్తుతి యాగముగా నీ సేవలో
ప్రాణార్పణ చేతునే (2) ||నా జీవం||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area