నా హృదయ లోగిలిలో | Naa Hrudaya Logililo Song Lyrics - S P Balu Christian Songs Lyrics
Singer | S P Balu |
నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి
నీ ప్రేమ కౌగిలిలో నను ఓదిగిపోని (2)
నీ ఆత్మతో నను నిండని - నీ సాక్షిగా ఇలలో నన్నుండని ||నా హృదయ||
1. నా లోపల సంచరించి - నాతో భుజియించి
జీవపు మార్గము చూపించి - సరిగా నడిపించి(2)
నా జీవితం వెలిగించినావా (2)
నీ రూపమే నాలో ముద్రించినావ ||నా హృదయ||
2. బలహీనతలను హరియించి - శక్తితో దీవించి
అజ్ఞానము నిర్ములించి - సత్యము బోధించి (2)
నా భారమే భరియించినావ (2)
నీ శాంతినే నాలో స్థాపించినావ ||నా హృదయ||
3. అనురాగముతో బందించి - ఆప్యాయత పంచి
ఆనందము ననుగ్రహించి - ఆత్మీయత పెంచి (2)
నా శోకమే తొలగించినావ (2)
స్తుతి గానమే నాలో పలికించినావ ||నా హృదయ||