హృదయమే నీ ఆలయం క్రీస్తు | Hrudhayame nee alayam kreesthu song lyrics | Old Christian Telugu Songs - P Suseela Lyrics

Singer | P Suseela |
హృదయమే నీ ఆలయం క్రీస్తు.......
నీ నామమే నా గానం
విదితము కాదే ఇలలో ఎవరికీ
వివరింపగా నీ పవన రూపం
హృదయమే నీ ఆలయం క్రీస్తూ......
మనిషి మనిషిగా బ్రతకాలని
మంచిని మనసున పెంచాలని
సిలువలో నీవు మరణించి (2)
మృత్యువునే నీవు ఎదురించి
వెలసిన దేవుడా నీవే
పాపుల రక్షణ నీవే........|| హృదయమే ||
కారు చీకటిలో కాంతి రేఖవై
మూగ గుండెల్లో దివ్య వాణివై
దీనులనే నీవు కరుణించి.....(2)
వేదనలే నీవు తరలించి
పరమున చేరిన దేవా...
శరణు శరణు ఓ ప్రభువా.....|| హృదయమే ||