సమీపించరాని తేజస్సులో | Samipincharani Tejassulo song lyrics - Telugu Christian Songs Lyrics
Singer | Bro. Abraham |
సమీపించరాని తేజస్సులో నీవు
వసియించు వాడవైనా
మా సమీపమునకు దిగి వచ్చినావు
నీ ప్రేమ వర్ణింప తరమా
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కృప ఎంత విలువైనది
ధరయందు నేనుండ చెరయందు పడియుండ
కరమందు దాచితివే
నన్నే పరమున చేర్చితివే
ఖలునకు కరుణను నొసగితివి
మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచి
నా స్థితి మార్చినది
నన్నే శ్రుతిగా చేసినది
తులువకు విలువను ఇచ్చినది