రేయి పగలు నీ పదసేవే | Reyi Pagalu Ni padaseve Song Lyrics - Sis. Nissy Paul | Old Christian Worship Song Lyrics
Singer | Sis. Nissy Paul |
రేయి పగలు నీ పదసేవే - జీవదాయకమే చేయుట మేలు సాటిలేని దేవుడ నీవే - నాదుకోట కొండయు నీవే (2)
1. పరమపురిలో దేవా నిరతం - దూత గణములు స్తుతులను సల్పి -
శుద్దుడు పరిశుద్ధు డనుచు - పూజ నొందే దేవుడ నీవే (2) ||రేయి||
2. జిగటమన్నే మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా -
సృష్టికర్తను మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా (2) ||రేయి||
3. పెంట కుప్పల నుండి దీనుల - పైకిలేపు ప్రభుడవు నీవే -
గర్వమణిచి గద్దెలు దింపి - ఘనులనైనా మేపవా గడ్డి (2) ||రేయి||
4. నరుల నమ్ముటకంటె నిజముగ - నీదు చరణం శరణం దేవా -
రాజులను ధరనమ్ముటకంటె - రాజ రాజవు నాకాశ్రయము (2) ||రేయి||
5. అగ్నివాసన నంటకుండా - అబెద్నగోలతో నుండిన దేవ -
దానియేలును సింహపు బోనులో - ఆదుకున్న నాథుడ నీవే (2)||రేయి||
6. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు - పరము జేర్చే పథము నీవే-
అడుగు జాడలో నడచిన హనోకు - పరముచేరే ప్రాణము తొడ (2) ||రేయి||
7. మృతుల సహితము లేపినావు - మృతిని గెల్చి లేచినావు -
మృతులనెల్ల లేపేవాడవు - మృత్యువును మృతి జేసితి నీవు (2) ||రేయి||