ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే | Emundhi Naalo Song Lyrics - Sis. Akshaya Song Lyrics
Singer | Sis. Akshaya |
ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే
అయినా నన్ను ప్రేమించితివే
ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా
అయినను నన్ను ప్రేమించావు
కరుణించావు నన్ను విడిపించావు|| ఏముంది ||
అన్యాయపు తీర్పు పొందావ నాకై
అపహాస్యం భరియించవా
ఆదరనే కరువై బాధింపబడియు
నీ నోరు తెరువలేదే
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
నీ త్యాగమే నన్ను మురిపించింది
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
నీ త్యాగమే నన్ను పులకించింది|| ఏముంది ||
గుచ్చిరి శిరమున ముండ్ల మకుటం
నాకోసం భరియించవా
ఊసిరి నీదు మోము పైన
అపహాస్యం సహీంచవా
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
నీ త్యాగమే నన్ను మురిపించింది
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
నీ త్యాగమే నన్ను పులకించింది|| ఏముంది ||