పల్లె పల్లెనా సువార్త |Palle Pallena Suvaartha Song Lyrics | Pastham Simon Victor Song - Bro. Simon Victor Lyrics
Singer | Bro. Simon Victor |
పల్లె పల్లెనా సువార్త పనులే జరగాలి
పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి - 2
ప్రజలందరూ ప్రభుని నమ్మాలి
పరలోకమే వున్నదని తెలియాలి
మరణించిన మనిషికి బ్రతుకు వున్నదని
మహనీయులకు తెలియాలి
క్రీస్తు ద్వారానే స్వర్ఙ్గముందని
ప్రతి మనిషి తెలుసుకోవాలి || పల్లె పల్లెనా ||
1 . పెందలకడ నీవు లేచి
అందరితో నీవు కలసి
క్రీస్తు మరణం పునరుధ్హానం
ప్రకటించుచు పనులు చేస్తూ
అందమైన లోకముందని
ఆయుష్షు ప్రభుకై ఖర్చు చేసి
నిత్యజీవము పొందుకొనుమని
ప్రకటించుచు సాక్షార్థమై
క్రేస్తేసుల ప్రభుని ఘనపరచి
జీవితం లోన మాదిరి చూపి
నిందారహితుడవై క్రియలు చేయుచు సత్యముగా బ్రతకాలి
ఎదుటి వారికి మేలు చేయుచు కీడు చేయక బ్రతకాలి || పల్లె పల్లెనా ||
2 గొప్ప గొప్ప సభలు చేసి
వేళా మందిని కూర్చోబెట్టి
తండ్రి ప్రేమను తెలియచేసి
మనిషి ప్రేమ చిన్నదనియు
మనిసులోన ఉన్న మలినం
వాక్యముతో పారద్రోలి
మాయలోకం మనది కాదని
మంచి అంటే వాక్యమే అని
పేతురు పౌలు ల వాక్యము తెలిపి
వాస్తవమైన జీవితం ఉందని
సందేహములో వున్నవారిని సత్యములో నడపాలి
అగ్నిలో నుండి రక్షించే ఆదరణ నీవు చూపాలి || పల్లె పల్లెనా ||