Type Here to Get Search Results !

Na thandri nanu mannichu Song Lyrics | నా తండ్రి నన్ను మన్నించు | Sis. Starry Angelina Edwards Song

Na thandri nanu mannichu Song Lyrics | నా తండ్రి నన్ను మన్నించు | Sis. Starry Angelina Edwards Song Lyrics

Singer Sis. Starry

నా తండ్రి నన్ను మన్నించు – నీకన్న ప్రేమించే వారెవరు? | 2 |
లోకంనాదేయని నిన్ను విడిచాను – ఘోర పాపిని నేను యోగ్యతే లేదు | 2 |

1. ఓ మోసపోయి తిరిగి వచ్చాను – నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను
నీదు బిడ్డగా నే పెరిగి – నీ ప్రేమను చూడలేక పోయాను
నే చూచిన ఈలోకం – నన్నెంతో మురిపించింది - 2
నీబంధం తెంచుకుని – దూరానికి పరుగెత్తాను
నేనమ్మిన ఈలోకం శోకమునే చూపించింది /లోకంనాదే/

2. నీ కన్నులు నాకొరకు ఎంతగ ఎదురు చూచినవో
నిన్ను మించిన ప్రేమ ఎక్కడ కానరాలేదు - 2
నే చనిపోయి బ్రతికానని – తిరిగి నీకు దొరికానని
గుండెలకు హత్తుకొంటివే – నీ ప్రేమ ఎంతో చూపితివే /నా తండ్రి/



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area