Emmaayi dhaarulalo Song Lyrics | ఎమ్మాయి దారులలో - Old Christian Melody Songs Lyrics

Singer | Unknown |
ఎమ్మాయి దారులలో, కృంగిన వేళలలో
నా యేసు నడిచెనుగా నా కన్నులు తెరిచెనుగా
యేసే అజేయుడు నా యేసే సజీవుడు హల్లెలూయ
యేసే ఆరాధ్యుడు నా యేసే ప్రాణ ప్రియుడు
1.ఆ కోరు లోయలలోన గాడాందకారములోన
నడచెను ఒంటరిగాను - నా యేసు నాలో వుండును
చల్లని నీడలలోన జలదారు తావులలోన
నా యేసుపై ఆనుకోని నే సాగిపోయెదనుIIయేసేII
2. శోధన వేదనలోన గాలి తుఫానులలోన
నా యేసు నా నావలోన నిదురించిన చాలును
సాగర కెరటాలైన సాతాను పోరాటమైన
నా యేసుని ఆనుకొని హాయిగ పయనించెదనుIIయేసేII
3. గుడార యానములోన నా జీవిత యాత్రలోన
ఆరణ్యదారులలోన నా జీవితా నావలోన
ఇరులే తరులే ఒరిగిన పర్వతాలుయె తొలిగిన
ఆభయ మిచ్చిన వాడు మారడు నా యేసుడుIIయేసేII