Type Here to Get Search Results !

Ashraya Durgama Na Yesayya Song Lyrics | ఆశ్రయదుర్గమా నా యేసయ్యా | Hosanna Ministries Song Lyrics

Ashraya Durgama Na Yesayya Song Lyrics | ఆశ్రయదుర్గమా నా యేసయ్యా - Yesanna Garu Song Lyrics

Singer Yesanna Garu

పల్లవి : ఆశ్రయదుర్గమా నా యేసయ్యా
నవజీవన మార్గమున నన్ను నడిపించుమా!
ఊహించలేనే - నీ కౄపలేని క్షణమును
కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే

1.లోకమర్యాదలు మమకారాలు గతించిపోవునే
ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి
|| ఆశ్రయ ||

2.నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటినే
నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి
|| ఆశ్రయ ||

3.పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను
నీ శిక్షణలో అణుకువతోనే నీ కృపపొదెద
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి
|| ఆశ్రయ ||

4.నిత్యనివాసివై నీ ముఖముచూచుచు పరవసించెదనే
ఈ నిరీక్షణయే ఉత్తేజము నలో కలిగించుచున్నది
స్తుతిఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా
హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా!
|| ఆశ్రయ ||



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area