ఏపాటిదో నా జీవితం | Yepatidho naa jeevitham Song Lyrics - Dr. Satish Kumar | Calvary Temple Songs Lyrics
Singer | Dr. Satish Kumar |
ఏ పాటిదో నా జీవితం ఏ లాంటిదో ఆ నా గతం
ప్రభు యేసులో నాజీవితం
మారి పోయేగా ఆ నా గతం
నన్ను ప్రేమించిన నాకై మరణించిన నన్ను విడిపించినయేసుకే(2)
ప్రభు యేసు నీకే స్వాగతం మారి పోయేగా ఆ నా గతం- (2)
ఏ పాటిదో నా జీవితం
ఏ లాంటిదో ఆ నా గతం
1. ఎందుకో పుట్టానని - నా బ్రతుకే దండగని… (2)
పనికిరాని వాడనని - పైకి అసలే రాలేనని
పది మంది నన్ను చూచి గేళి చేయువేళా….
పనికొచ్చే పాత్రగా నన్ను చేసిన
పరిశుద్ధునిగా నన్ను మార్చిన
యేసయ్య నీకే స్తోత్రమూ
మెస్సయ్య నీకే స్తోత్రమూ(2) || ఏ పాటిదో ||
2. అంద చెందాలు లేవని - చదువు సంధ్యలే అబ్బని-(2)
తెలివి తక్కువ వాడనని - లోక జ్ఞానమే లేదనీ…
పది మంది నన్ను చూచి
గేళి చేయు వేళ.. ఆ ఆ..
పరిశుద్ధాత్మతో నన్ను నింపిన
సిలువ సాక్షిగా నన్ను మార్చిన
యేసయ్య నీకే స్తోత్రమూ
మెస్సయ్య నీకే స్తోత్రమూ(2) || ఏ పాటిదో ||