Type Here to Get Search Results !

రేయి పగలు నీ పాదసేవే | Reyi Pagalu Nee Paadaseve Song Lyrics | Telugu Old Christian Songs

రేయి పగలు నీ పాదసేవే | Reyi Pagalu Nee Paadaseve Song Lyrics - Sis. Nissy Paul | Telugu Old Christian Songs Lyrics

Singer Sis. Nissy Paul

రేయి పగలు నీ పదసేవే - జీవదాయకమే చేయుట మేలు సాటిలేని దేవుడ నీవే - నాదుకోట కొండయు నీవే (2)


1. పరమపురిలో దేవా నిరతం - దూత గణములు స్తుతులను సల్పి -

శుద్దుడు పరిశుద్ధు డనుచు - పూజ నొందే దేవుడ నీవే (2) ||రేయి||


2. జిగటమన్నే మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా -

సృష్టికర్తను మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా (2) ||రేయి||


3. పెంట కుప్పల నుండి దీనుల - పైకిలేపు ప్రభుడవు నీవే -

గర్వమణిచి గద్దెలు దింపి - ఘనులనైనా మేపవా గడ్డి (2) ||రేయి||


4. నరుల నమ్ముటకంటె నిజముగ - నీదు చరణం శరణం దేవా -

రాజులను ధరనమ్ముటకంటె - రాజ రాజవు నాకాశ్రయము (2) ||రేయి||


5. అగ్నివాసన నంటకుండా - అబెద్నగోలతో నుండిన దేవ -

దానియేలును సింహపు బోనులో - ఆదుకున్న నాథుడ నీవే (2)||రేయి||


6. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు - పరము జేర్చే పథము నీవే -
అడుగు జాడలో నడచిన హనోకు - పరముచేరే ప్రాణము తొడ (2) ||రేయి||


7. మృతుల సహితము లేపినావు - మృతిని గెల్చి లేచినావు -

మృతులనెల్ల లేపేవాడవు - మృత్యువును మృతి జేసితి నీవు (2) ||రేయి||



Telugu Christian Songs Lyrics