Type Here to Get Search Results !

Prema saswatha kalamundunu | ప్రేమ శాశ్వత కాలముండును | Ps. Praveen Songs | Old Christian Songs Lyrics

Prema saswatha kalamundunu | ప్రేమ శాశ్వత కాలముండును | Ps. Praveen Songs - Old Christian Songs Lyrics

Singer Ps. Praveen

ప్రేమ శాశ్వత కాలముండును
ప్రేమ అన్నిటిలో శ్రేష్టము (2)
ప్రేమ విలువ సిలువ జూపె
ప్రేమ ఎట్టిదో ప్రభువు నేర్పె (2)
ప్రేమ చూపు పరుల యెడల
ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ||

ప్రేమలో దీర్ఘశాంతము
ప్రేమలో దయాళుత్వము (2)
ప్రేమ సహింప నేర్పును
ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ||

ప్రేమలో డంబముండదు
ప్రేమ ఉప్పొంగదెప్పుడు (2)
ప్రేమలో తగ్గింపున్నది
ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ||

ప్రేమించు సహోదరునీ
ప్రార్ధించు శత్రువుకై (2)
ప్రేమ యేసుని మనస్సు
ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ||

ప్రేమలో సత్యమున్నది
ప్రేమ సంతోషమిచ్చును (2)
ప్రేమయే సమాధానము
ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ||

విశ్వాసము నిరీక్షణ ప్రేమ
ఈ మూడు నిలచునూ (2)
వీటిలో శ్రేష్టమైనది
ప్రేమయే... ప్రేమయే... ||ప్రేమ||

ప్రేమ యేసయ్య ప్రేమ
ప్రేమ కల్వరి ప్రేమ (2)
హల్లెలూయా... హల్లెలూయా...(2)||ప్రేమ||



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area