నా నీతి సూర్యుడా | Naa Neethi Suryuda Song Lyrics - Ps. John Wesly | Hosanna Ministries Song Lyrics
Singer | Ps. John Wesly |
నా నీతి సూర్యుడా – భువినేలు యేసయ్యా
సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని /2/
రాజులకే రారాజువు – కృపచూపే దేవుడవు
నడిపించే నజరేయుడా – కాపాడే కాపరివి /నా నీతి/
1. శ్రమలలో బహు శ్రమలలో – ఆదరణ కలిగించెను
వాక్యమే కృపా వాక్యమే – నను వీడని అనుబంధమై /2/
నీ మాటలే జల ధారాలై – సంతృప్తి నిచ్చెను
నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను
నీ మాటే మధురమ్! / రాజులకే /
2. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు
యేదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారిని /2/
భీకరమైన కార్యములు చేయుచున్నవాడ
సజీవుడవై అధికస్తోత్రము పొందుచున్న వాడ
ఘనపరతును నిన్నే!
ప్రేమించే యేసయ్యా – నీవుంటే చాలునయ
నడిపించే నజరేయుడా – కాపాడే కాపరివి /నా నీతి/
3. సంఘమై నీ స్వాస్థ్యమై నను నీయెదుట నిలపాలని
ఆత్మతో మహిమాత్మతో నను ముద్రించియున్నావు నీవు /2/
వరములతో ఫలములతో నీకై బ్రతకాలని…
తుదిశ్వాశ నీసన్నిధిలో విజయం చూడాలని…
ఆశతో వున్నానయ!
కరుణించే యేసయ్యా – నీకోసమే నాజీవితం
నినుచేరే ఆశయం తీరాలని – నిను చూసే ఆక్షణం రావాలయ్యా /నా నీతి/