జ్యోతిర్మయుడా | Jyothirmayuda Song Lyrics - Sis. Betty | Hosanna Ministries Lyrics
Singer | Sis. Betty |
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా
స్తుతి మహిమలు నీకే
నా ఆత్మలో అనుక్షణం
నా అతిశయము నీవే – నా ఆనందము నీవే
నా ఆరాధనా నీవే (2) ||జ్యోతి||
నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా (2)
నీ తోటలోని ద్రాక్షావల్లితో
నను అంటు కట్టి స్థిరపరచావా (2) ||జ్యోతి||
నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి (2)
నీకిష్టమైన పాత్రను చేయ
నను విసిరేయక సారెపై ఉంచావా (2) ||జ్యోతి||
నా తండ్రి కుమారా – పరిశుద్దాత్ముడా (2)
త్రియేక దేవా ఆదిసంభూతుడా
నిను నేనేమని ఆరాధించెద (2) ||జ్యోతి||