Type Here to Get Search Results !

దేవునికి స్తోత్రము గానము | DEVUNIKI STHOTHRAMU GAANAMU Song Lyrics | Andhra Kraistava Keerthanalu

దేవునికి స్తోత్రము గానము | DEVUNIKI STHOTHRAMU GAANAMU Song Lyrics - PJD Kumar | Andhra Kraistava Keerthanalu Lyrics

Singer PJD Kumar

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది

యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని
ఇశ్రయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి||

గుండె చెదరిన వారిని బాగుచేయువాడని
వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి||

నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును
వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని ||దేవునికి||

ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవునికి||

దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును
సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవునికి||

ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును
భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని ||దేవునికి||

పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను
అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవునికి||

గుర్రముల నరులందలి బలము నానందించడు
కృప వేడు వారిలో సంతసించువాడని ||దేవునికి||

యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని
కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవునికి||

పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్
మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును ||దేవునికి||

భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే
వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును ||దేవునికి||

వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని
ఏ జనముకీలాగున చేసియుండలేదని ||దేవునికి||



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area