ఆశ్రయమా-ఆధారమా | Asryama Adharama Song Lyrics | K Y Ratnam Songs - Bro. KY Ratnam Lyrics
Singer | Bro. KY Ratnam |
పల్లవి :
ఆశ్రయమా-ఆధారమా నీవే నా యేసయ్య...
నా దుర్గమ్మ నా శైల మా నీవే నా యేసయ్య (2)
నిన్ను విడిచి నేను ఉండలేను
క్షణమైనా నీ బ్రతుకలేను(2)
చరణం :1
కష్టకాలములు.... నన్ను కృంగదీసి నన్ను
అరణ్యరోదనలూ.... నన్ను ఆవరించినన్ను (2)
నా వెంట నీవుండి నావు- నీ కృపను చూపించినావు (2)
ఆశ్రయమా
చరణం:2
భక్తిహీనులు....నాపై పొర్లిపడిననన్ను
శత్రు సైన్యము... నన్ను చుట్టుముట్టినన్ను (2)
నా వెంట నీవుండి నావు - కాపాడి రక్షించినావు(2)
ఆశ్రయమా
చరణం :3
మరణ పాశములు...నన్ను చుట్టుకొనగాను
బంధు స్నేహితులు... నన్ను బాధ పెట్టి నన్ను (2)
నా వెంట నీవుండి నావు - దయ చూపి దీవించినావు (2)
ఆశ్రయమా