Type Here to Get Search Results !

యేసుని కొరకై | Yesuni Korakai song Lyrics | Andhra kristava keertanalu

యేసుని కొరకై | Yesuni Korakai song Lyrics - Dr. Jay Paul | Andhra kristava keertanalu

Singer Dr. Jay Paul

యేసుని కొరకై యిల జీవించెద
భాసురముగ నే ననుదినము
దోసములన్నియు బాపెను మోక్ష
ని వాసమున ప్రభు జేర్చునుగా ||యేసుని||

నాశనకరమగు గుంటలోనుండియు
మోసకరంబగు యూబినుండి - 2
నాశచే నిలపై కెత్తెను నన్ను
పి శాచి పథంబున దొలగించెన్ ||యేసుని||

పలువిధముల పాపంబును జేసితి
వలదని ద్రోసితి వాక్యమును - 2
కలుషము బాపెను కరుణను బిలిచెను
సిలువలో నన్నాకర్షించెను ||యేసుని||

అలయక సొలయక సాగిపోదును
వెలయగ నా ప్రభు మార్గములన్ - 2
కలిగెను నెమ్మది కలువరిగిరిలో
విలువగు రక్తము చిందించిన ప్రభు||యేసుని||

శోధన బాధలు శ్రమలిల కల్గిన
ఆదుకొనును నా ప్రభువనిశం - 2
వ్యాధులు లేములు మరణము
వచ్చిన నాధుడే నా నిరీక్షణగున్||యేసుని||

బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు
గుప్తమై యున్నవి ప్రభునందు - 2
అద్భుతముగ ప్రభు వన్నియునొసగి
దిద్దును నా బ్రతుకంటిని ||యేసుని||

అర్పించెను దన ప్రాణమునాకై
రక్షించెను నా ప్రియ ప్రభువు - 2
అర్పింతును నా యావజ్జీవము
రక్షకు డేసుని సేవింప||యేసుని||

ప్రభునందానందింతును నిరతము
ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే - 2
దీర్చునుయిలనా చింతలు
అభయముతో స్తుతియింతు ప్రభున్ ||యేసుని||

యౌవన జనమా యిదియే
సమయము యేసుని చాటను - 2
రారండి పావన నామము పరిశుద్ధ నామము
జీవపు మార్గము ప్రచురింపన్ ||యేసుని||



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area