స్తుతులందుకో యేసయ్య | Sthuthulandhuko yesayya song Lyrics - Sis. Ramana | Praise and Worship Song Lyrics
Singer | Sis. Ramana |
స్తుతులందుకో యేసయ్య నా స్తుతులందుకో యేసయ్య
ధవళవర్ణుడా రత్నవర్ణుడా
పదివేలలో అతికాంక్షణీయుడా - 2
1 : వేయినోళ్లతో కీర్తించిన
తీర్చలేను నీ రుణమును
విస్తార తైలము నీకిచ్చిన
తీరునా నీ త్యాగము - 2
నలిగిన నా హృదయ గీతికా
అందుకో స్తుతి మాలిక
స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తోత్రార్హుడా
స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తుతిపాత్రుడా - 2 || స్తుతులందుకో ||
2: యోగ్యత లేని నన్ను
పిలిచావు నీ సాక్షిగా
అర్హత లేని నన్ను
ఆదరించి బ్రతికించావు - 2
నా జీవిత కాలమంతా
ప్రకటింతు నీ నామము
స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తోత్రార్హుడా
స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తుతిపాత్రుడా - 2 || స్తుతులందుకో ||