ప్రబలముగనే | Prabalamugane song lyrics - Sis.Elfy Sannidhi | ANDHRA CHRISTIAN HYMNAL Lyrics
Singer | Sis.Elfy Sannidhi |
ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్ని
ప్రతి దినము నిను ప్రచురపరచెద ప్రభుడ నావిభుడా ||ప్ర||
పొందుగోరి నా యందు నిలిచిన బంధుమిత్రుడవు
మందమతి కా నందమొసగిన మహిమతేజుడవు ||ప్ర||
చింతదీర్చి నా భ్రాంతి మార్చితి వెంత వింతదియో
స్వాంతమున కడు శాంతిగూర్చితి వెంత కరుణదియో ||ప్ర||
నీతి కరపిన జాతి మరపిన ఖ్యాతి యేసునిదే
నీరసుడ నను గారవించిన నీతిరాజితడే ||ప్ర||
జీవమిచ్చిన జావవచ్చిన దేవసుత నీవే
జీవదాయక బ్రోవరా యిక జాలమేలనురా ||ప్ర||
నిమిషనిమిషము నిను భజించెద నెమ్మనంబునను
శమదమాది సుగుణశోభిత సమ్మదిని నిమ్మా ||ప్ర||