పరిశుద్ధ పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా | parishudda parishudda - Dr Jayapaul | Telugu Christian Songs Lyrics
Singer | Dr Jayapaul |
పరిశుద్ధ పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా
వరదూత లైననిన్ వర్ణింపగలరా || పరిశుద్ధ ||
1)పరిశుద్ధ జనకుడ - పరమాత్మ రూపుడ
నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా || పరిశుద్ధ ||
2)పరిశుద్ధ తనయుడ నరరూప ధారుడా
నరులను రక్షించు కరుణా సముద్రా || పరిశుద్ధ ||
3)పరిశుద్ధమగు నాత్మ వరము లిడు నాత్మ
పరమానంద ప్రేమ భక్తులకిడుమా || పరిశుద్ధ ||
4)జనక కుమారాత్మ లనునేక దేవా
ఘనమహిమ చెల్లును - దనర నిత్యముగా || పరిశుద్ధ ||