Type Here to Get Search Results !

నీవుంటే నాకు చాలు యేసయ్యా | Neevunte chalu naku yesayya lyrics | Telugu Christian Songs Lyrics

నీవుంటే నాకు చాలు యేసయ్యా | Neevunte chalu naku yesayya lyrics - Sreshta | Telugu Christian Songs Lyrics

Singer Sreshta

నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీవెంటే నేను ఉంటానేసయ్యా (2)
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2) ||నీవుంటే||

ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ
ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2) ||నీ మాట||

బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ
అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2) ||నీ మాట||

ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా
ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2) ||నీ మాట||

నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేమియు కాదిల సమానము (2) ||నీ మాట||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area