Type Here to Get Search Results !

నీ కృప లేని క్షణము | Nee krupa leni kshanamu lyrics | Jesus Songs

నీ కృప లేని క్షణము | Nee krupa leni kshanamu lyrics - P. John Wesly | Jesus Song Lyrics

Singer P. John Wesly

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా

నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము
నేనూహించలేను యేసయ్యా (2)
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) ||నీ కృప||

మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహిని నీవు మాధుర్యముగా మార్చి
మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2)
మహిమలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది నీ కృప (2) ||యేసయ్యా||

ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు (2)
ఆశ తీర ఆరాధన చేసే
అదృష్టమిచ్చింది నీ కృప (2) ||యేసయ్యా



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area