Type Here to Get Search Results !

నా ప్రాణమా దిగులెందుకు | Na pranama digulenduku lyrics | Telugu Worship Song Lyrics

నా ప్రాణమా దిగులెందుకు | Na pranama song lyrics - Bro KIRAN | Telugu Worship Song Lyrics

Singer Bro KIRAN

నా ప్రాణమా దిగులెందుకు - నీ రక్షకుని స్మరియించుకో
మహిమోన్నతుడు బలవంతుడు - నీ పక్షమునే నిలిచెనుచూడు

లెవరా వీరుడా నిరాశను వీడరా నీ రాజు నిన్ను పిలిచెను
కదులు ముందుకు కదులు ముందుకు
అసాధ్యుడే నీకుండగా అసాధ్యము నీకుండునా
భయము వీడి నడవరా జయమునీదే జయమునీదే

౹౹నా ప్రాణమా

1.
యేసులో విశ్వాసమే నీ చేతిలోని ఆయుధం
విడువకుండ పట్టుకో ఎన్ని శ్రమలు నీకు కలిగినా
లేమిలో కొలిమిలో ఒంటరివి కావు ఎన్నడూ
యేసు నీతో ఉండును నీ సహాయమాయనే
నీవు వెంబడించువాడు నీవు నమ్మదగిన దేవుడు
నీ శ్రమలు దూరపరచును నిన్ను గొప్పగా హెచ్చించును (2)

|| నా ప్రాణమా

2.
గర్జించు సింహమువలె సాతాను వెంటపడినను
ఎదురుతిరిగి నిలబడు వాడు నిలువలేకపోవును
జయించెనేసు ఏన్నడో సాతాను ఓడిపోయెను
నీ ఎదుటనున్న శత్రువు ప్రభావము శూన్యమే
నీలోన ఉన్నవాడు లోకములనేలువాడు
నిర్భయముగా సాగిపో నీన్ను ఆపలేరు ఎవ్వరు (2)

|| నా ప్రాణమా

3.
నీవు ఎక్కలేని కొండను ఎక్కించును నీ దేవుడు
నీవు చేరలేని ఎత్తుకు నిన్ను మోయునాయనే
నీ ప్రయాస కాదు వ్యర్థము యేసు గొప్ప ఫలము దాచెను
తన తండ్రి ఇంట నీకును సిద్ధపరిచెను నివాసము
ఊహించలేని మహిమతో ప్రభువు నిన్ను నింపివేయును
ఆశ్చర్యమైన స్వాస్థ్యము నీ చేతికప్పగించును (2)

౹౹నా ప్రాణమా



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area