నా ఆనందములో నిన్నే | Na anandamulo ninne - KY Ratnam | Jesus songs lyrics in telugu
Singer | KY Ratnam |
నా ఆనందములో నిన్నే స్తుతించెదనేసయ్యా
నా విజయములో నిన్నే ఘనపరిచెదనేసయ్యా //2 //
తరాలెన్ని మారిన సంవత్సరాలే గడిచిన //2 //
నీ కృప నను వీడ లేదు
//నా ఆనందములో//
1) ప్రతికూల సమయములో ప్రత్యక్షమైనావు
యెహోవా యీరేగా నా ముందు నిలిచావు //2 //
పగిలిన హృదయముతో నే మోకరించగా
ఊహించని మాటలతో నన్నాదరించావు //2 //
తరాలెన్ని మారిన సంవత్సరాలే గడిచిన //2 //
నీ కృప నను వీడ లేదు
//నా ఆనందములో//
2) నీ మంచి తనమంతా నా పైన చూపావు
నా ప్రాణమును ఎంతో ప్రియముగా ఎంచావు //2 //
నేనేమైనా నిన్నే స్తుతియింతును
నాలో ఉన్న నా ప్రియా నేస్తమా //2 //
తరాలెన్ని మారిన సంవత్సరాలే గడిచిన //2 //
నీ కృప నను వీడ లేదు
//నా ఆనందములో//
3) మూయబడిన ద్వారమును నా కొరకు తెరిచావు
అధికమైన మేలులతో ఆశీర్వదించావు //2 //
కన్నీరైనా నను ఓదార్చావు
కలవరమైన నీ కృపనే చూపావు //2 //
తరాలెన్ని మారిన సంవత్సరాలే గడిచిన //2 //
నీ కృప నను వీడ లేదు
//నా ఆనందములో//