కొండలతట్టు నా | Kondalathattu Song Lyrics - Bro. Philip Lyrics
Singer | Bro. Philip |
కొండలతట్టు నా కనులెత్తుచున్నాను
నాకు సహాయము ఎచటనుండి వచ్చును
"యెహోవా వలననే నాకు సహాయము కలుగును
తన నామములోనే అన్నీ కలుగును"
1. భూమి ఆకాశమును సృజియించిన యెహోవా
నీ పాదమును తొట్రిల్లనీయడు
కునుకడు నిదురపోడు
ఇశ్రాయేలును కాపాడువాడు నిన్ను కాపాడును
"యెహోవా వలననే నాకు సహాయము కలుగును
తన నామములోనే అన్నీ కలుగును"
2. పగలు ఎండ రాత్రి వెన్నెల దెబ్బ ఏదైన తగులకుండ
తోడుగా నీడగా నీ వెంట ఉండి నడిపించును
ఇశ్రాయేలును కాపాడువాడు నిన్ను కాపాడును
"యెహోవా వలననే నాకు సహాయము కలుగును
తన నామములోనే అన్నీ కలుగును"
2. ఇది మొదలు నిరంతరం
నీ రాకపోకలలో యెహోవా
ఏ అపాయము రాకుండా నీ ప్రాణము కాపాడువాడు
ఇశ్రాయేలును కాపాడువాడు నిన్ను కాపాడును
"యెహోవా వలననే నాకు సహాయము కలుగును
తన నామములోనే అన్నీ కలుగును"