ఇశ్రాయేలు దేవా యెహోవా | ISRAELU DEVA YEHOVA Lyrics | Ps. Stephen Paul | Telugu Christian Songs Lyrics

Singer | Ps. Stephen Paul |
ఇశ్రాయేలు దేవా యెహోవా నీవే మాకు దైవం
నీవే నిత్య సత్య మార్గ జీవం
ఇమ్మానుయేలు దేవా యేసయ్య నీవే మాకు తోడు
నీవే రక్షకుండు నాడు నేడు
నీ నామమే ఘనమైనది
నీ కృపయే నిజమైనది
ఆరాధింతును యేసయ్య ,
ఆనంద, మానందమే హల్లెలూయ
1. అబ్రాహాము సంతతిని దీవించితివి
యాకోబు ప్రార్ధన ఆలించితివి
ఇసాకునెంతో హెచ్చించితివి
దావీదుని రాజుగ చేసితివి
దీనులకై మరణించితివి
ధన్యత మాకిల నొసగితివి
2.నా శత్రువులే నన్ను తరిమినను
భూమిపునాదులు కదిలినను
మరణపు ఉరులే ఆవరించిన
మరణపాశములు చుట్టుకొనిన
నా మీదికే లేచిన దెవరైనా
నీ ప్రభావముతో జయించెదను