గడ్డి పరకే ఈ జీవితం | Gaddi Parake Ee Jeevitham - Hema Chandra | Telugu Christian Songs Lyrics
Singer | Hema Chandra |
గడ్డి పరకే ఈ జీవితం
ఎందుకు నీకీ ఆరాటం
మహిలో నీవు మట్టి పురుగువు
విలువే లేని గడ్డి పువ్వువు
1. క్షణ భంగురమే
ఈ లోక మాయలు
గగన కుసుమాలే
ఈ లోక ఆశలు
ఎండమావి వెంటే పయనం
తీర్చదు నీ దాహం
ప్రభువిచ్చునులే జీవజలం
తీర్చుకో నీ ఆత్మదాహం // గడ్డి పరకే //
2. అల్పకాలమే
ఈ లోక ప్రేమలు
అశాశ్వతమే
ఈ లోక బందాలు
లోకం కోసం ఆరాటం
చేర్చదు నిను పరలోకం
ప్రభువిచ్చును శాశ్వతజీవం
అందుకో ఆ ఆత్మఫలం // గడ్డి పరకే //