Type Here to Get Search Results !

యేసయ్య నీ ప్రేమ నా సొంతము - Yesayya Nee Prema Naa Sonthamu - Telugu Christian Songs Lyrics

యేసయ్య నీ ప్రేమ నా సొంతము - Sireesha - Telugu Christian Songs Lyrics

Singer Sireesha

యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము
యేసయ్య నీవేగ తొలికిరణము - నాలోన వెలిగిన రవికిరణము
ఏనాడు ఆరని నా దీపము - నా జీవితానికి ఆధారము
ఇమ్మానుయేలుగా నీ స్నేహము - నాలోన నిత్యము ఒక సంబరం

1. ఏపాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నను దాచినావు
నా భారమంతా నువు మోసినావు - నన్నెంతగానో హెచ్చించినావు

నీ కృపలోనే నను కాచినావు - నీ కనికరమే చూపించినావు
నా హృదిలోనే నీ వాక్యధ్యానం - నా మదిలోనే నీ నామస్మరణం

నిన్నే ఆరాధించి - నీ దయలో నే జీవించి
నిన్నే నే పూజించి - నీలో నే తరియించీ

2. ఏనాడు నన్ను విడనాడలేదు - నీ నీడలోనే నడిపించినావు
లోకాలనేలే రారాజు నీవే - నా జీవనావకు రహదారి నీవే

నా గురి నీవే నా యేసుదేవా - చేరితి నిన్నే నా ప్రాణనాథా
పర్వత శిఖరం నీ మహిమ ద్వారం - ఉన్నతమైనది నీ దివ్య చరితం

సాటే లేరు నీకు - సర్వాథికారివి నీవు
మారని దైవం నీవు - మహిమోన్నతుడవు నీవు



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area