ఊహించలేదయ్యా ఈ మేలులన్నియు - Telugu Christian Songs Lyrics
Singer | Telugu Christian Songs |
పల్లవి :-
ఊహించలేదయ్యా ఈ మేలులన్నియు
తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు /2/
పాడకుండా ఉండలేనయ్యా
నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా /2/*Charanam* 1
తీసివేయబడినాను త్రోసివేయబడినాను
ఆకస్మాత్తుగా గుంటలో
నెట్టివేయబడినాను /2/
అందరూ వదిలేసినా
నీవు నన్ను పట్టుకున్నావు
దుఃఖము ముంచేసినా
నీవు పైకి లేపావయ్యా /2/
పాడకుండా*
Charanam 2
ఉడికిపోయి ఉన్నాను ఎండిపోయి ఉన్నాను
ఆశలన్నీ నీరుగారి వేసారిపోయాను /2/
ఆఖరి ఆక్షణములో
నీవు నన్ను దర్శించినావు
ఊహించని నీ మేళ్ళుతో
నన్ను తృప్తి పరిచావయ్యా /2/
పాడకుండా