నీవు ఒంటరివా.... తోడులేక ఉన్నావా ..... - Jonah Samuel - Telugu Christian Songs Lyrics
Singer | Jonah Samuel |
నీవు ఒంటరివా.... తోడులేక ఉన్నావా .....
నీవు బానిసవా..... స్వేచ్చ లేక ఉన్నావా....(2)
తృణీకరింపబడినవా.... ప్రేమలేక ఉన్నావా...
ఓదార్పు లేక ఉన్నావా.... ఓడిపోయినావా ...(2)
అనుపల్లవి:
అయితే...నేస్తమా...యేసుని చేరుమా....
ఇప్పుడే....ఇక్కడే.. నీ హక్కుని పొందుమా....(2)
((1)) నీవు నమ్మిన నీవారే.. వంచించి వెళ్ళినా......
ప్రేమించిన నీ హితులే.... నీ చేయి విడువగా...(2)
నీ మార్గం అగమ్యై....దారే కానరాక....
నీ బంధం అబద్ధమై అర్దం చూపలేక....(2)
ప్రేమ కోసమే నీవు పరుగెడుచున్నావా.....
శాంతి కోసమే నీవు వెదకుచున్నావా.....(2)
(అనుపల్లవి)
((2)) ఎండమావిలో నీటికోసమై.... పరుగిడుచున్నవా..
స్వప్నములోనే లోకముందని..... భ్రమపడుచున్నవా..
కళ్ళనిండా కన్నీరై ... కాంతి కానరాక.....
నిరీక్షణ లేని నీ బ్రతుకే అంతం కోరగా...(2)
నీ పాపములకు నీవు దాసుడవైనావా...
విడుదల కోసం నీవు వేచియున్నవా.....(2)
(అనుపల్లవి)