ఆశతో నీ కొరకు ఎదురుచూచుచుండగా - Ramya- Jesus Songs Telugu Lyrics

Singer | Ramya |
ఆశతో నీ కొరకు ఎదురుచూచుచుండగా
నూతన బలముతో ననునింపినావు "2"
బలహీనులను బలపరచువాడా
కృంగిన వారిని లేవనెత్తువాడా "2"
యేసయ్యా నా ఆశ్రయమా
యేసయ్యా నీకే ఆరాధన "2"
(ఆశతో నీ కొరకు)
సొమ్మసిల్లక అడుగులు తడబడక
నడిచెద నీ వెంట జీవితమంతా "2"
లోకము నన్ను ఆకర్షించిన
వెనుదిరుగక నే సాగెద నీ వెంట "2"
(యేసయ్యా)
అలయక నేను పరుగెత్తెదను
అంతము వరకు ఆత్మల రక్షణకై "2"
సిద్ధము చేసిన బహుమానముకై
గురియొద్దకు నేను సాగెదనయ్యా "2"
(యేసయ్యా)
రెక్కలు చాపి పక్షి రాజువలెనే
పైకెగెరెద నీ పరిశుద్ధులతో "2"
పరవశించెదను నీ ముఖమును చూచి
ప్రణమిల్లెద నీ పాదముల చెంత "2"
(యేసయ్యా)