Type Here to Get Search Results !

కృప వెంబడి కృపతో - Krupa Vembadi Krupatho - Jesus Songs Telugu Lyrics

కృప వెంబడి కృపతో నను ప్రేమించిన - Jesus Songs Telugu Lyrics

Singer unknown

కృప వెంబడి కృపతో
నను ప్రేమించిన నా యేసయ్యా
నను ప్రేమించిన నా యేసయ్యా (2)
నను కరుణించిన నా యేసయ్యా (2) ||కృప||

నా యెడల నీకున్న తలంపులు
బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా (2)
అవి వర్ణించలేను నా యేసయ్యా
అవి వివరింపలేను నా యేసయ్యా (2)
నా యెడల నీకున్న వాంఛలన్నియు ||కృప||

ఎన్నో దినములు నిన్ను నే విడచితిని
ఎన్నో దినములు నిన్ను నే మరచితిని (2)
విడువని ఎడబాయని నా యేసయ్యా
మరువక ప్రేమించిన నా యేసయ్యా (2)
ఏమిచ్చి నీ ఋణము తీర్చెదనయ్యా ||కృప||



Telugu Christian Songs Lyrics