ఎండిన ఎడారి బ్రతుకులో నిండైన ఆశ నీవేగా - Sis Blessy - Telugu Christian Songs Lyrics
Singer | Sis Blessy - Telugu Christian Songs |
ఎండిన ఎడారి బ్రతుకులో
నిండైన ఆశ నీవేగా
యేసు.. నిండైన ఆశ నీవేగా
తడబడెడు నా పాదములకు
తోడు నీవే గదా
యేసు.. తోడు నీవే సదా ||ఎండిన||
ఎండమావులు చూచి నేను
అలసి వేసారితి (2)
జీవ జలముల ఊట నీవై
సేద దీర్చితివి
నా బలము నీవైతివే
యేసు.. బలము నీవైతివే
నిత్య మహిమకు నిలయుడా నీ
దివ్య కాంతిలోన (2)
నీదు ఆత్మతో నన్ను నింపి
ఫలింప జేసితివే
నా సారధి నీవైతివే
యేసు.. సారధి నీవైతివే
అంధకార లోయలెన్నో
ఎదురు నిలచినను (2)
గాయపడిన నీ హస్తమే నన్ను
గమ్యము చేర్చును
నా శరణు నీవే గదా
యేసు.. శరణు నీవే గదా ||ఎండిన||