Type Here to Get Search Results !

ఏ యోగ్యతా లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా - Ae Yogyathaa Leni Nannu - Telugu Christian Songs Lyrics

ఏ యోగ్యతా లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా - SP Balu - Telugu Christian Songs Lyrics

Singer SP Balu - Telugu Christian Songs

ఏ యోగ్యతా లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా
ఏ అర్హతా లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా
నీకేమి చెల్లింతును
నీ ఋణమెలా తీర్తును (2) ||ఏ యోగ్యతా||

కలుషితుడైన పాపాత్ముడను
నిష్కళంకముగా నను మార్చుటకు (2)
పావన దేహంలో గాయాలు పొంది (2)
రక్తమంత చిందించినావా ||నీకేమి||

సుందరమైన నీ రూపమును
మంటివాడనైన నాకీయుటకు (2)
వస్త్రహీనుడుగా సిలువలో వ్రేళాడి (2)
నీ సొగసును కోల్పోయినావా ||నీకేమి||

పాపము వలన మృతినొందిన
అపరాధినైన నను లేపుటకు (2)
నా స్థానమందు నా శిక్ష భరించి (2)
మరణించి తిరిగి లేచావా ||నీకేమి||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area