ఏమని ఏమని నే పాడెదన్ - - Telugu Christian Songs Lyrics
Singer | - Telugu Christian Songs |
పల్లవి: ఏమని ఏమని నే పాడెదన్
ఎట్లు ఎట్లు ఎట్లు నిన్ను స్తుతియించెదన్
హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా
1. కలువరిగిరి దర్శనం చూడాలని
కడవరకు నీ సాక్షిగా ఉండాలని
అలనాటి పౌలులా బ్రతకాలని
పరిశుద్ధడనై నేను ఉండాలని
2. దానియేలు వలెనే ఉండాలని
ఆశించిన నా హృదయం ప్రార్థించెనే
యాకోబును దర్శించిన ఆలాగున
నన్ను నీవు దర్శించవా
3. మోషేకు తోడై నడిపించిన నా దేవా
నా తోడు నీవై నడిపించవా
యెహోషువ ప్రార్థన నాకు నేర్పు దేవా
సూర్యచంద్రులనాపితివే