Type Here to Get Search Results !

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు - Ae Baadha Ledu Ae Kashtam Ledu - Telugu christian songs lyrics

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు - Calvary - telugu christian songs lyrics

Singer Calvary

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా
ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా
దిగులేల ఓ సోదరా ప్రభువే మనకండగా
భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ (2) ||ఏ బాధ||

ఎర్ర సంద్రం ఎదురొచ్చినా
యెరికో గోడలు అడ్డొచ్చినా
సాతాను శోధించినా
శత్రువులే శాసించినా
పడకు భయపడకు బలవంతుడే నీకుండగా
నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా ||దిగులేల||

పర్వతాలు తొలగినా
మెట్టలు తత్తరిల్లినా
తుఫానులు చెలరేగినా
వరదలు ఉప్పొంగినా
కడకు నీ కడకు ప్రభు యేసే దిగి వచ్ఛుగా
నమ్ము ఇది నమ్ము యెహోవా యీరే కదా ||దిగులేల||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area