ఉత్సాహ గానము చేసెదము - Bro.Yesanna Garu Christian Song Lyrics

Singer | Bro.Yesanna Garu |
Song Writer | Bro.Yesanna Garu |
ఉత్సాహ గానము చేసెదము
ఘనపరచెదము మన యేసయ్య నామమును (2)
హల్లెలూయ యెహోవ రాఫా
హల్లెలూయ యెహోవ షమ్మా
హల్లెలూయ యెహోవ ఈరే
హల్లెలూయ యెహోవ షాలోమ్ (2)
అమూల్యములైన వాగ్ధానములు
అత్యధికముగా ఉన్నవి (2)
వాటిని మనము నమ్మినయెడల
దేవుని మహిమను ఆనుభవించెదము (2) ||హల్లెలూయ||
వాగ్ధాన దేశము పితరులకిచ్చిన
నమ్మదగిన దేవుడాయన (2)
జయించిన వారమై అర్హత పొంది
నూతన యెరుషలేం ఆనుభవించెదము (2) ||హల్లెలూయ||