Type Here to Get Search Results !

ఈలాటిదా యేసు ప్రేమ -నన్ను - Eelaatidaa Yesu Prema - Andhra Christava Keertanalu Lyrics

ఈలాటిదా యేసు ప్రేమ -నన్ను - Dr. Betty Sandesh - Andhra Christava Keertanalu Lyrics

Singer Dr. Betty Sandesh
Song Writer రావూరి రంగయ్య

ఈలాటిదా యేసు ప్రేమ -నన్ను
తూలనాడక తనదు జాలి చూపినదా ||ఈలాటిదా||

ఎనలేని పాప కూపమున – నేను
తనికి మిణుకుచును నే దరి గానకుండన్
కనికరము పెంచి నాయందు – వేగ
గొనిపోవ నా మేలు కొరికిందు వచ్చె ||ఈలాటిదా||

పెనుగొన్న దుఃఖాబ్ధిలోన – నేను
మునిగి కుములుచు నేడు పునగుండు నపుడు
నను నీచుడని త్రోయలేక – తనదు
నెనరు నా కగుపరచి నీతి జూపించె ||ఈలాటిదా||

నెమ్మి రవ్వంతైనా లేక – చింత
క్రమ్మిపొగలుచు నుండ-గా నన్ను జూచి
సమ్మతిని నను బ్రోవ దలచి – కరము
జాచి నా చేయి బట్టి చక్కగా పిలిచె ||ఈలాటిదా||

పనికిమాలిన వాడనైన – నేను
కనపరచు నా దోష కపటవర్తనము
మనసు నుంచక తాపపడక యింత
ఘనమైన రక్షణ-మును నాకు చూపె ||ఈలాటిదా||

నా కోర్కెలెల్ల సమయములన్ – క్రింది
లోక వాంఛల భ్రమసి లొంగెడు వేళన్
చేకూర్చి ధృడము చిత్తమునన్ – శుభము
నా కొసంగె జీవింప నా రక్షకుండు ||ఈలాటిదా||

శోధనలు నను చుట్టినప్పుడు – నీతి
బోధ నా మనసులో పుట్టించి పెంచి
బాధలెల్లను బాపి మాపి – యిట్టి
యాదరణ జూపిన యహాఁహాఁ యేమందు ||ఈలాటిదా||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area