తరచి తరచి చూడ తరమా - Blessy Wesly | Telugu Christian Songs Lyrics
Singer | Blessy Wesly |
తరచి తరచి చూడ తరమా
వెదకి వెదకి కనుగొనగలమా
యేసు వంటి మిత్రుని లోకమందున
విడచి విడచి ఉండగలమా
మరచి మరచి ఇలా మనగలమా
యేసు వంటి స్నేహితుని విశ్వమందున
లోక బంధాలన్నీ తృప్తినివ్వలేవుగా
ఏ మనిషిని నమ్మాలో – తెలియదు ఈ లోకంలో
నేల మంటిలోన పరమార్ధం లేదుగా
ఎంత బ్రతుకు బ్రతికినా – చివరకు చితియేగా
నమ్మదగిన యేసు ప్రాణమిచ్చె నీకై
జగతిలోన దొరకునా ఇటువంటి ప్రాణప్రియుడు (2) ||తరచి||
లేరు లేరు ఎవ్వరు కానరారు ఎవ్వరు
యేసు వంటి ప్రేమికుడు ఇహమందు పరమందు
పదివేలలోన అతి కాంక్షణీయుడు
కలతలన్ని తీర్చి కన్నీటిని తుడచును
కల్వరిగిరిలోన కార్చెను రుధిరం
హృదయమందు చేర్చుకో కృప చూపు నాథుని (2) ||తరచి||