శక్తి చేత కాదు బలము చేత కాదు - Akumarthi Daniel -Prasie Songs Lyrics
Singer | Akumarthi Daniel |
శక్తి చేత కాదు
బలము చేత కాదు
దేవుని ఆత్మచే
సమస్తము సాధ్యము (2) ||శక్తి||
నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని
చేసెను దేవుడు శూన్యము నుండి (2)
తన రూపులో తన పోలికలో (2)
నిర్మించెను దేవుడు నరుని మంటి నుండి (2) ||శక్తి||
కౄరమైన సింహాల బోనైననూ
విశ్వాసముతో సాగెను దానియేలు (2)
అగ్ని గుండములో మరణ శాసనములో (2)
ఇమ్మానుయేలు యేసయ్య తోడుగా (2) ||శక్తి||
ఘోరమైన పాపాల బానిసైననూ
భారమైన బ్రతుకును గడుపుచున్ననూ (2)
ప్రియమార నిన్నే పిలువంగ యేసు (2)
దరి చేర రావా ఆ ప్రేమ నాథుని (2) ||శక్తి||