Type Here to Get Search Results !

ఓ యాత్రికుడా ఓహో యాత్రికుడా | O Yaathrikudaa Oho Yaathrikudaa | Christian Gospel Song Lyrics

ఓ యాత్రికుడా ఓహో యాత్రికుడా - Pavan - Christian Gospel Song Lyrics

Singer Pavan

ఓ యాత్రికుడా ఓహో యాత్రికుడా
బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా..
ఓ బాటసారి ఓహో బాటసారి
జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా
గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపొతుంది
నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది (2)
అంతా ఆ దైవ నిర్ణయం
మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా||

పుట్టగానే తొట్టెలో వేస్తారు
గిట్టగానే పెట్టెలో మూస్తారు
జాగు చేయక కాటికి మోస్తారు
ఆరడుగుల గుంటలో తోస్తారు ఆ అ ఆ. ఆ.. (2)
బ్రతుకు మూల్యమింతే – మనిషికి ఉన్న విలువంతే (2)
అంతా ఆ దైవ నిర్ణయం
మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా||

ఏడ్చుకుంటూ భూమిపై పుడతావు
ఏడిపిస్తూ సమాధికి పోతావు
కూడబెట్టినవి మోసుకు పోలేవు
ఆశించినవేవి నీ వెంటారావు ఓ ఒ ఓ..ఓ.. (2)
జీవిత సారము ఇంతే – మనిషి బ్రతుకు భావము అంతే (2)
అంతా ఆ దైవ నిర్ణయం
మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా||

మరణము ఒక నిద్ర యేసునందు
అంతము అది కాదు క్రీస్తునందు
మృతులు లేచుట స్థిరము యేసునందు
నిత్య జీవము వరము క్రీస్తునందు ఆ అ ఆ.. ఆ.. (2)
నేడే రక్షన సమయము – ఇక ఆలసించిన నరకము (2)
అంతా ఆ దైవ నిర్ణయం
మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area