నిరంతరం నీతోనే జీవించాలనే - Ps John Wesly | Nirantharam neethone jeevinchalani song lyrics
Singer | Ps John Wesly |
నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది (2)
నా ప్రాణేశ్వరా యేసయ్యా
నా సర్వస్వమా యేసయ్యా ||నిరంతరం||
చీకటిలో నేనున్నప్పుడు
నీ వెలుగు నాపై ఉదయించెను (2)
నీలోనే నేను వెలగాలని
నీ మహిమ నాలో నిలవాలని (2)
పరిశుద్ధాత్మ అభిషేకముతో
నన్ను నింపుచున్నావు నీ రాకడకై ||నిరంతరం||
నీ రూపము నేను కోల్పయినా
నీ రక్తముతో కడిగితివి (2)
నీతోనే నేను నడవాలని
నీ వలెనే నేను మారాలని (2)
పరిశుద్ధాత్మ వరములతో
అలంకరించుచున్నావు నీ రాకడకై ||నిరంతరం||
తొలకరి వర్షపు జల్లులలో
నీ పొలములోని నాటితివి (2)
నీలోనే చిగురించాలని
నీలోనే పుష్పించాలని (2)
పరిశుద్ధాత్మ వర్షముతో
సిద్ధపరచుచున్నావు నీ రాకడకై ||నిరంతరం||