Type Here to Get Search Results !

నిన్ను తలచి నను నేను మరచి - Ninnu Thalachi Nanu Nenu Marachi - Christian Songs Lyrics

నిన్ను తలచి నను నేను మరచి - Christian Songs Lyrics

Singer Unknown

నిన్ను తలచి నను నేను మరచి
నీ సాక్షిగా ఇల నే బ్రతుకుచుంటిని (2)
యేసయ్యా.. నీ కృప లేక నే బ్రతుకలేను (2) ||నిను తలచి||

జీవము లేని దైవారాధనలో
నిర్జీవ క్రియలతో మృతుడనైతిని (2)
జీవాధిపతివై నా జీవితానికి
నిత్య జీవము నొసగిన యేసయ్యా (2) ||నిను తలచి||

దారే తెలియని కారు చీకటిలో
బ్రతుకే భారమై నలిగిపోతిని (2)
నీతి సూర్యుడా ఎదలో ఉదయించి
బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా (2) ||నిను తలచి||

సద్గుణ శీలుడా సుగుణాలు చూచి
హృదిలో నేను మురిసిపోతిని (2)
సుగుణాలు చూచుటకే నీవు
సిలువలో నాకై నలిగిన యేసయ్యా (2) ||నిను తలచి||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area