నమ్మదగిన దేవుడవు యేసయ్యా - Symon Peter - Praise and Worship Song Lyrics
Singer | Symon Peter |
నమ్మదగిన దేవుడవు యేసయ్యా
నిత్య జీవమిచ్చు దేవుడవు నీవయ్యా (2)
నా తేజోమయుడా నాదు రక్షకా
నను విడిపించిన నా విమోచకా (2)
నీ శరణు జొచ్చితి ఆదరించుము
సేదదీర్చి నీ అక్కున చేర్చుము
యేసయ్యా… సేదదీర్చి నీ అక్కున చేర్చుము ||నమ్మదగిన||
నా ప్రాణము దప్పిగొని ఆశపడెనే
నీ కృపా వార్తను వినిపించుము (2)
నా పూర్ణ హృదయముతో ఆత్మతో
కృతజ్ణతా స్తుతులు చెల్లించెదన్ (2) ||నీ శరణు||
నా ప్రాణము ఆపదలో చిక్కుబడెనే
నను రక్షించుటకై చేయి చాచితివే (2)
పదితంతుల సితారతో గానముతో
స్తుతి గానం చేసి కీర్తించెదన్ (2) ||నీ శరణు||